ఇరాన్, భారత్ మధ్య 9 కీలక ఒప్పందాలు
- February 17, 2018
న్యూఢిల్లీ: భారత్, ఇరాన్ మధ్య ఇవాళ పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. చర్చల అనంతరం సుమారు తొమ్మిది అగ్రిమెంట్లపై సంతకాలు జరిగాయి. చాబహర్ పోర్ట్ వినియోగం, వైద్యం, వ్యవసాయం, ఆరోగ్యం లాంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. రోహనీ, మోదీలు కలిసి సంయుక్తంగా పోస్టల్ స్టాంపులను కూడా రిలీజ్ చేశారు. రోహనీ రాక వల్ల రెండు దేశాల మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని మోదీ అన్నారు. ప్రెసిడెంట్ రౌహనీ విజన్‌ను అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ద్వైపాక్షిక ఆర్థిక సహకారం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇరు దేశాల మధ్య మైత్రి పెరిగిందని ఇరాన్ అధ్యక్షుడు రౌహనీ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







