ప్రవాసీయుల '' ట్రాన్స్ కతర్ ' సుదూర పరుగు కతర్ లో ప్రారంభం
- February 17, 2018
దోహా : కతర్ మరియు ఇతర దేశాల పోటీదారులతో సహా 15 మంది సభ్యుల బృందం సుదూర పరుగుల క్రీడాకారులు ఫిబ్రవరి 23 వ తేదీన 190 కిలోమీటర్ల ' ట్రాన్స్ కతర్ ' కోసం దేశంలోని ఒక చివర నుండి మరో చివర లక్ష్యంగా పరుగులు పెట్టనున్నారు. ఫ్రెంచ్ ప్రవాసియ లోఇకి బర్డన్ నేతృత్వంలోని ఈ బృందం యూకె , బ్రెజిల్, కెనడా, భారతదేశం, మొరాకో, ఫిలిప్పీన్స్, నైజీరియా, స్పెయిన్ నుండి ఇతర సభ్యులను కలిగి ఉంటుంది. దేశంలో ఉన్న కొంతమంది ఆఫ్రికన్ల నుంచి ఈ బృందం విచారణను స్వీకరిస్తోందని సభ్యుడు వినోద్ గోపీనాథ్ చెప్పారు. ఈ పరుగు ఫిబ్రవరి 23 వ తేదీ వేకువజామున ప్రారంభం కానుంది. అదేరోజు మెసయిడ్ సమీపంలో దక్షిణ సరిహద్దులో 20 కిలోమీటర్ల నుండి మరియు ఉత్తర సరిహద్దులో షామల్ పార్కు వద్ద మరుసటి రోజు ఉదయం చేరుకొంటుంది. పోటీదారులు ప్రధానంగా ఎడారి ప్రాంతాల మీదుగా పరులుతీస్తారు . మార్గం వెంట నాలుగు నీటి కేంద్రాలు ఏర్పాటై ఉంటుంది. "మార్గం వెంట, రన్నర్లు సల్వా రోడ్డు, దుఖన్ హైవే, మరియు షమాల్ ఎక్స్ ప్రెస్ మార్గంను దాటుతుందని గోపినాథ్ వివరించారు. "దేశవ్యాప్తంగా మా పరుగులు మారథాన్ 42 కిలోమీటర్ల పరుగు కంటే ఎక్కువ ఆసక్తిని పెంచుతుందని మేము ఆశిస్తున్నాము" అని మరొక భాగస్వామి చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







