ఐఆర్సీటీసీ వారి దుబాయ్, అబుదాబి పర్యటన ప్యాకేజీ
- February 17, 2018
హైదరాబాద్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మరో ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్, అబుదాబికి నాలుగు రోజుల పర్యటన ప్యాకేజీని వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 18 నుంచి మార్చి 31,2018 వరకు సాగే పర్యటనలో భాగంగా దుబాయ్ సిటీటూర్లో భాగంగా కింగ్స్ ప్యాలెస్, ఢోక్రూస్, డెసర్ట్ సఫారి, గ్లోబల్ విల్లేజ్, బుర్జ్ అల్ అరబ్ 7 స్టార్ హోటల్, బుర్జ్ఖలీఫ, దుబాయ్ మాల్తోపాటు అబుదాబితో పాటు అబుదాబి గ్రాండ్ మాస్క్, హెరిటేజ్ విలేజ్ వంటి ప్రాంతాల పర్యటన ఉంటుంది. ఇందులో భాగంగా త్రీస్టార్ హోటల్ వసతి, ఏసీ ప్రయాణం, గైడ్ను అందిస్తారు. ఒక్కొక్కరికి ప్యాకేజీలో భాగంగా చార్జీని రూ. 61,042గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







