వదిలివేయబడిన 33 వాహనాలు అబూధాబిలో స్వాధీనం

- February 18, 2018 , by Maagulf
వదిలివేయబడిన 33 వాహనాలు అబూధాబిలో స్వాధీనం

అబుదాబి: నగరంలో చాలా కాలం నుండి యజమానులచేత వదిలివేయబడిన 33 వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అబూధాబి సిటీ మున్సిపాలిటీ తెలిపింది. సిటీ మునిసిపల్ మరియు ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంట్రల్ ద్వారా నగరంలో ఒక తనిఖీని నిర్వహించారు. ఈ ప్రచారం అనేక ప్రాంతాలలో కొనసాగింది . రాజధానిలో దీర్ఘ కాలం పాటు గమనింపబడని వదిలివేసిన వాహనాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఫలితంగా. ఈ వాహనాలను స్వాధీనం చేసుకొని నగరానికి దూరంగా ఉన్న యార్డ్ వద్దకు తరలించారు.  మున్సిపాలిటీ అబూధాబీలో 2012 చట్టం (2) నిబంధనల అమలులో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు  హెల్త్ అండ్ ట్రాంక్విలిటీని నిర్వర్తించడం కొనసాగుతాయని పేర్కొంది. ఈ చట్టం లోని  నిబంధనల ప్రకారం 3,000 దిర్హామ్ జరిమానా నేరస్థులకు జారీ చేయబడుతుందని మున్సిపాలిటీ తెలిపింది. ఇటువంటి ప్రచారాల ద్వారా, మునిసిపాలిటీ పబ్లిక్ ప్రాంతాలలో దీర్ఘకాలిక సౌకర్యాలలో వాహనాలను విడిచిపెట్టకుండా ప్రజలకు అవగాహన కల్గించేందుకు ప్రయత్నిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com