సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలిసిన కమల్‌హాసన్
- February 18, 2018
చెన్నైః రాజకీయాల్లోనూ చేతులు కలపబోతున్నారన్న వార్తల మధ్య ఇవాళ ఇద్దరు తమిళ సూపర్‌స్టార్లు సమావేశమయ్యారు. తన రాజకీయ యాత్ర గురించి రజనీతో చర్చించడానికి కమల్‌హాసన్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ నెల 21న పార్టీని ప్రారంభించనున్న కమల్.. ఆ తర్వాత తాను చేపట్టబోయే యాత్రపై రజనీతో చర్చించారు. అయితే ఇది రాజకీయ భేటీ కాదని, ఓ శ్రేయోభిలాషిగా మాత్రమే రజనీని కలిశానని కమల్ చెప్పాడు. రాష్ట్రంలో యాత్ర చేపట్టాలని అనుకుంటున్నట్లు రజనీతో చెప్పాను. యాత్ర మొదలుపెట్టే ముందు నాకు నచ్చిన వ్యక్తులను కలుస్తున్నాను. స్నేహితుడిగానే రజనీని కలిశాను తప్ప అందులో రాజకీయ కోణం లేదు అని కమల్ స్పష్టంచేశాడు. మరి భవిష్యత్తులోనైనా రజనీతో చేతులు కలుపుతారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. కాలమే సమాధానం చెప్పాలని అని కమల్ అన్నాడు.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







