అమరావతి రైతుల సింగపూర్ టూర్
- February 18, 2018
అమరావతి: సింగపూర్ అభివృద్ధి విశేషాలను తెలుసుకునేందుకు సీఆర్డీయే ఆధ్వర్యంలో రాజధాని రైతుల మూడో బృందం ఆదివారం ఆ దేశ పర్యటనకు బయలుదేరింది. మొత్తం 39 మంది రైతులు వెలగపూడి సచివాలయం నుంచి బస్సులో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ నెల 23న వారు పర్యటన ముగించుకుని తిరిగి వస్తారు. పర్యటనలో అబ్బరాజుపాలెం, అనంతవరం, బోరుపాలెం, దొండపాడు, కృష్ణాయపాలెం, లింగాయపాలెం, మల్కాపురం, మందడం, నేలపాడు, నిడమర్రు, పెనుమాక, తుళ్లూరు, ఐనవోలు గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు. వీరికి, సింగపూర్ అధికారులకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించేందుకు సీఆర్డీయే అధికారులు కూడా రైతులతో పాటు వెళ్లారు. ఇప్పటికే రెండు విడతలుగా 64మంది రైతులు సింగపూర్ పర్యటనకు వెళ్లి వచ్చారు. సింగపూర్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందేలా రైతులు తోడ్పాటునందించేందుకు సీఆర్డీయే ఈ పర్యటనలు ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







