ఫెడరర్ ఖాతాలో 97వ టైటిల్
- February 18, 2018
నెదర్లాండ్స్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన కెరీర్‌లో 97వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన రోటర్‌డామ్ ఓపెన్ టోర్నీలో అతను మూడోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో ఫెడరర్ 6–2, 6–2తో దిమిత్రోవ్ (బల్గేరియా)ను అలవోకగా ఓడించాడు.
55 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో ఫెడరర్ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. సోమ వారం మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్న ఫెడరర్ తాజా విజయంతో అతని ర్యాంక్ నాలుగు వారాలపాటు పదిలంగా ఉంటుంది. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 4,01,580 యూరోల (రూ. 3 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







