ప్రముఖ హీరోహీరోయిన్లు శ్రీకాంత్, ఊహ చిన్న కొడుకు సినీ ప్రవేశం
- February 19, 2018
ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ చిన్న కుమారుడు రోహన్ సైతం వెండితెరపైకి వచ్చేస్తున్నాడు. ఏకంగా త్రిభాషా చిత్రంతో మాస్టర్ రోహన్ సిల్వర్ స్ర్కీన్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
ప్రముఖ హీరోహీరోయిన్లు శ్రీకాంత్, ఊహ దంపతులు ఏ ముహూర్తాన ప్రేమ వివాహం చేసుకున్నారో కానీ వారి పిల్లలు సైతం నటనకే అంకితమైపోతున్నారు. శ్రీకాంత్ కుమార్తె మేధ, కుమారుడు రోషన్ బాలనటులుగా 'రుద్రమదేవి' చిత్రంలో నటించారు. ఇక రోషన్ అయితే ఓ అడుగు ముందుకేసి 'నిర్మల కాన్వెంట్' చిత్రంలో ఏకంగా హీరోగానూ నటించి మెప్పించాడు. ఇప్పుడు శ్రీకాంత్, ఊహ చిన్న కొడుకు రోహన్ సైతం వెండితెరకు పరిచయం అవుతున్నాడు.
పాపులర్ కొరియోగ్రాఫర్, యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా నటిస్తున్న ఓ త్రిభాషా చిత్రంలో శ్రీకాంత్ చిన్నకుమారుడు రోహన్ నటిస్తున్నాడు. ప్రభుదేవా, రోహన్ తండ్రీకొడుకులుగా నటించే ఈ సినిమా హిట్ స్టేషన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోతోంది. ఇటీవలే ఊటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పేషన్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ఆకాశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తండ్రీకొడుకుల అనుబంధాన్ని తెలిపే ఈ ఫ్యామిలీ డ్రామాలో కాస్తంత హారర్ ఎలిమెంట్ కూడా ఉందని తెలుస్తోంది.
విశేషం ఏమంటే శ్రీకాంత్ నటించిన తొలి హారర్ ఫిల్మ్ 'రా.. రా' ఈ నెల 23న విడుదల కాబోతోంది. మరి శ్రీకాంత్‌కు ఎలాంటి పుత్రోత్సాహాన్ని చిన్న కుమారుడు అందిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







