రోడ్డుపై నడుస్తూ మొబైల్‌ ఫోన్‌ వినియోగించొద్దు

- February 20, 2018 , by Maagulf
రోడ్డుపై నడుస్తూ మొబైల్‌ ఫోన్‌ వినియోగించొద్దు

రోడ్డుపై నడిచే పాదచారులు, ఆ సమయంలో మొబైల్‌ ఫోన్‌ వినియోగించడం ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అనేక నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అబుదాబీ పోలీస్‌, పాదచారులకు కలిగే ప్రమాదాల్ని నివారించడం కోసం, పాదచారులు నడుస్తూ ఫోన్‌ మాట్లాడకూడదని హెచ్చరించింది. ఫోన్‌లో మాట్లాడటం, టెక్స్‌ట్‌ మెసేజ్‌ చేయడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయని అధికారులు చెప్పారు. సోషల్‌ మీడియా ద్వారా ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా రోడ్డు దాటేప్పుడు ఫోన్‌లో మాట్లాడటం, టెక్స్‌ట్‌ ఛాటింగ్‌లో పాదచారులు మునిగిపోవడం వల్ల వేగంగా వచ్చే వాహనాల్ని గుర్తించలేకపోతున్నారని, తద్వారా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని పోలీసులు చెప్పారు. రోడ్డు క్రాస్‌ చేసేటప్పుడు ఫోన్‌ మాట్లాడినా, టెక్స్‌ట్‌ ఛాట్‌ చేసినా 400 దిర్హామ్‌ల జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com