పెళ్లిపీటలెక్కనున్న రజనీ హీరోయిన్ అమీ జాక్సన్!
- February 20, 2018
పెళ్లిపీటలెక్కనున్న రజనీ హీరోయిన్!
హైదరాబాద్: నటి అమీ జాక్సన్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది. బ్రిటన్‌కి చెందిన వ్యాపారవేత్త జార్జితో అమీ కొంతకాలంగా ప్రేమలో ఉంది. వ్యాలెంటైన్స్ డే రోజున అమీ..తన ప్రియుడికి విష్ చేస్తూ ఫొటో పోస్ట్ చేయడంతో ఆమె ప్రేమ విషయం అందరికీ తెలిసింది. అమీ స్వస్థలమైన బ్రిటన్ వెళ్లిన ప్రతీసారి తన ప్రియుడితోనే గడుపుతోందట. ఈ ఏడాదిలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసలైతే గతేడాదే వీరిద్దరి పెళ్లి జరగాల్సి ఉందట. కానీ సినిమాలతో బిజీగా ఉండడంతో పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం.
2010లో వచ్చిన 'మద్రాసపట్టణం' చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చింది అమీ. ఆ తరువాత బాలీవుడ్‌లో వచ్చిన 'ఏక్ దివానా థా' చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో వచ్చిన 'ఏ మాయ చేశావె' సినిమాకు ఇది రీమేక్‌గా వచ్చింది. ఆ తరువాత 'సింగ్ ఈజ్ బ్లింగ్', 'ఎవడు', 'ఐ' తదితర చిత్రాల్లో నటించింది. రజనీకాంత్, అమీ జాక్సన్ జంటగా నటించిన '2.0' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







