రెండు కొత్త రూట్లను ప్రకటించిన మవసలాత్‌

- February 20, 2018 , by Maagulf
రెండు కొత్త రూట్లను ప్రకటించిన మవసలాత్‌

మస్కట్‌: నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ (మవసలాత్‌), మస్కట్‌ - రుస్తాక్‌, మస్కట్‌ - సుమైల్‌ రూట్స్‌లో బస్సుల్ని ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త రూట్స్‌ని తాజాగా మవసలాత్‌ ప్రకటించింది. రోజూ రెండేసి సర్వీసులు ఒక్కో రూట్‌లో తిరుగుతాయి. రుస్తాక్‌లో ఉదయం 5.45 నిమిషాలకు ప్రారంభమయ్యే బస్సు, మస్కట్‌కి 7 గంటలకి చేరుకుంటుంది. అక్కడినుంచి సుమైల్‌కి 6 గంటలకు చేరుకుంది. మస్కట్‌కి చేరే సమయం 7 గంటలు. మస్కట్‌ మరియు విలాయత్స్‌కి వెళ్ళే ఉద్యోగుల అవసరార్థం టైమింగ్స్‌లో చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు. మస్కట్‌ - రుస్తాక్‌ రూట్‌లో మస్కట్‌ హైవే, అల్‌ కువైర్‌ పెడెస్ట్రియన్‌ టన్నెల్‌, బస్‌ స్టేషన్‌ అల్‌ అతైబా, అల్‌ సాహ్వా టవర్‌, అల్‌ హజమ్‌ రౌండెబౌట్‌, ఉస్తాక్‌ - సుల్తాన్‌ కబూస్‌ మాస్క్‌ మీదుగా సాగుతుంది ఈ ప్రయాణం. మస్కట్‌ - సుమైల్‌ రూట్‌లో అల్‌ కువైర్‌ పెడెస్ట్రియన్‌ టన్నెల్‌, బస్‌ స్టేషన్‌ అల్‌ అతైబా, అల్‌ సాహ్వా టవర్‌ స్టేషన్‌, ఫాంజా - సుల్తాన్‌ కబూస్‌ మాస్క్‌, బిద్‌బిద్‌ - ఒమన్‌ అరబ్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌, సుమైల్‌ - గేట్‌ ఆఫ్‌ సుమైల్‌ మీదుగా సాగుతుంది. కంపెనీకి చెందిన వివిధ ఆఫీసుల్లో ప్రయాణీకులు టిక్కెట్లు పొందవచ్చు. బస్‌లో కూడా టిక్కెట్లు లభ్యమవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com