'స్పీడున్నోడు' మరో కొత్త సినిమా

- February 21, 2018 , by Maagulf
'స్పీడున్నోడు' మరో కొత్త సినిమా

జయ జానకీ నాయక మంచి హిట్ కొట్టడంతో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'సాక్ష్యం' చిత్రం ఇంకా నిర్మాణంలో ఉండగానే ఈ 'స్పీడున్నోడు' మరో కొత్త సినిమాకు సైన్‌ చేశాడు. రేపటి(గురువారం) నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. రామానాయుడు స్టూడియోలో రేపు ఉదయం 9గంటలకు ఈ చిత్ర షూటింగ్‌ను ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంతో శ్రీనివాస్‌ దర్శకునిగా పరిచయమవుతున్నారు. వంశధార క్రియేషన్స్‌ బ్యానరుపై నవీన్‌ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడిగా చోటా కె. నాయుడు పని చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com