రెజీనా బాలీవుడ్‌లో ఎంట్రీ

- February 21, 2018 , by Maagulf
రెజీనా బాలీవుడ్‌లో ఎంట్రీ

హైదరాబాద్ : దక్షిణాది నుంచి త్రిష, కాజల్ అగర్వాల్‌తో పాటు పలువురు కథానాయికలు హిందీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా రెజీనా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నది. రాజ్‌కుమార్‌రావ్, సోనమ్‌కపూర్ ప్రధాన పాత్రల్లో ఎక్ లడికీ కో దేఖాతో ఐసా లగా పేరుతో ఓ మూవీ తెరకెక్కుతున్నది. విధు వినోద్‌చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి షెల్లీ చోప్రా ధార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో రెజీనా నటించనున్నది. గత కొంతకాలంగా తెలుగు, తమిళ భాషల్లో నటనకు ఆస్కారమున్న పాత్రల్లో కనిపిస్తున్నది రెజీనా. ఈ చిత్రాల్లో రెజీనా అభినయానికి ముగ్ధులైన బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. రెజీనాతో పాటు అనిల్‌కపూర్, జూహీచావ్లా ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకురానున్నది. గతంలో హిందీ చిత్రం ఆంఖేన్-2లో నటించే అవకాశం రెజీనాను వరించింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా సెట్స్‌పైకిరాలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com