హైదరాబాద్ లవ్ స్టోరీ రివ్యూ!
- February 23, 2018
అందాల రాక్షసితో తెలుగు సినిమాకు పరిచయం అయిన రాహుల్ లవర్ బాయ్ ఇమేజ్ మెయిన్ టైన్ చేస్తున్నాడు.ప్రేమకథలకు బాగా సూట్ అయ్యే పర్సనాలిటీ రాహుల్ కి బలం. మరోసారి ఆ లవ్ ఫీల్ తో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ చెప్పేందుకు రెడీ అయ్యాడు.ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ:
హైదరాబాద్ మోట్రో రైల్ ప్రాజెక్ట్ లో ఛీప్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు కార్తిక్( రాహుల్). అతన్ని తొలిచూపులోనే భాగి(రేష్మిమీనన్) ను ప్రేమిస్తుంది. అతనితో ప్రేమను పొందేందుకు ఆమె చాలా ప్రయత్నిస్తుంది.కార్తిక్ కూడా భాగీ ఇష్టపడతాడు. భాగీ తన ప్రేమను చెప్పేలోపు అతని పాత ప్రేమకథ తెలుస్తుంది. ఇంతలో ఆ ప్రేమకథలోని కార్తిక్ గాళ్ ప్రెండ్ వచ్చి కార్తిక్ గురించి ఒక షాకింగ్ న్యూస్ చెబుతుంది. అప్పటినుండి కార్తిక్ ని తప్పించుకు తిరుగుతుంది భాగీ. భాగీ ఎందుకు దూరం అవుతుందో తెలియక కార్తిక్ ఇబ్బంది పడుతుంటాడు. అసలు కార్తిక్ గురించి భాగీ కి తెలిసిన నిజం ఎంటి..? అతని మొదటి ప్రేమకథ ఎందుకు ఫెయిల్ అయ్యింది. భాగీ కార్తిక్ ల ప్రేమ కథ ఏ టర్న్ తీసుకుంది అనేది మిగిలిన కథ.
కథనం:
హైదరాబాద్ లవ్ స్టోరీ కి ప్లస్ పాయింట్స్ గా నిర్మాణ విలువలు నిలుస్తాయి. ఏం.ఏల్ రాజు, ఆర్, ఏస్. కిషన్, వేణు గోపాల్ నిర్మాణం హైదరాబాద్ లవ్ స్టోరీ రిచ్ గా అనిపించింది.స్నేహం మద్య నలిగిపోయిన ప్రేమకథలు ప్రేక్షకులకు కొత్త కాకపోయినా దర్శకుడు రాజ్ సత్య ఈ కథనం నడిపిన విధానం ప్రత్యేకంగా అనిపించింది.మెట్రో రైల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ ప్రేమకథకు ప్రెష్ ఫీల్ ని తెచ్చాడు. రాహుల్ రవీంద్రన్ లవర్ బాయ్ ఇమేజ్ ని హైదరాబాద్ లవ్ స్టోరీ మరో సారి నిలబెట్టింది. లవ్ ని ఫీల్ అయ్యే సందర్భాల్లో అతని నటన ఆకట్టుకుంది. హీరోయిన్ రేష్మి మీనన్ చలకీగా కనిపించింది. టీనేజ్ అమ్మాయిలకుండే అల్లరి, అమాకత్వం నిండిన పాత్రలో ఒదిగిపోయింది. రాహుల్ ని చూసేందుకు ఆమె పడే పాట్లను దర్శకుడు చాలా ఫన్ వేల్ తీసుకెళ్ళాడు. ఆమె స్ర్కీన్ ప్రజెన్స్ కూడా ఈ లవ్ స్టోరీ కి అసెట్ గా మారింది. రాహుల్ బ్లడ్ డోనేట్ చేసే టప్పుడు హిందువులకు బ్లడ్ అవసరం అయితే ముస్లీం అని , ముస్లీం లకు బ్లడ్ అవసరం అయితే హిందు అని చెప్పి సాయం చేయడం వంట సన్నివేశాలను చాలా ఇంప్రెసివ్ గా రాసుకున్నాడు దర్శకుడు రాజ్ సత్య. స్నేహం కోసం రాహుల్ పడే తరుణ అలాగే ఈ సినిమాలో రావు రామేష్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని ప్లే చేసాడు. కథను ముడి వేసేది, ఆకథను ముడి విప్పేది ఆ పాత్రే. అందుకే ఈ ప్రేమకథకు రావు రమేష్ కీ రోల్ ప్లే చేసాడు. ప్రేమను అర్దం చేసుకోవడం అంటే ప్రేమించిన వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే వచ్చే ఫీలింగ్స్ చెబుతాయి. అలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు ప్రేమ అని మోసం చేసుకోవడమే అవుతుంది. ఆ పాయింట్ ని క్లైమాక్స్ లో బాగా కన్వెన్సింగ్ చెప్పాడు దర్శకుడు. సునీల్ క్యశప్ బ్యాక గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.ప్రేమకథలలో ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’ తన ప్రత్యేకతను చాటుకుంది.
చివరిగా:
ఎంగేజింగ్ లవ్ స్టోరీ
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి