బాహుబలి' తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ కు దుబాయ్ లో మరోసారి భంగపాటు !
- February 26, 2018
బాహుబలి' తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ తన ఇమేజ్ ను ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మరింత పెంచుకోవడానికి సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న 'సాహో' కు మరొకసారి దుబాయ్ లో ఊహించని షాక్ తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలోని అత్యంత కీలకమైన ఒక చేజింగ్ సీన్ ను దుబాయ్ లో షూట్ చేయడానికి 'సాహో' టీమ్ గత 6 నెలలుగా విపరీతంగా ప్రయత్నాలు చేస్తోంది.
అత్యంత భారీ ఖర్చుతో విదేశీ సాంకేతిక నిపుణుల సహాయంతో చిత్రీకరించాలి అనుకున్న ఈ యాక్షన్ సీన్ షూటింగ్ కు దుబాయ్ ప్రభుత్వం 'సాహో' టీమ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుమతులు తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా దుబాయ్ అబుదాబి ప్రాంతాలలో హైవేల పై షూట్ చేయడానికి కఠిన నిబంధనలు ఉన్న నేపధ్యంలో 'సాహో' టీమ్ కు ఈ ఊహించని షాక్ ఎదురైంది అని అంటున్నారు.
దీనితో ఈ సీన్ చిత్రీకరణకు సెట్ వేసుకోవడం మినహా మరే మార్గం లేదు అని నిర్థారణకు రావడంతో 'సాహో' టీమ్ రామోజీ ఫిలిం సిటీలో భారీ రోడ్ ను తాత్కాలికంగా దాదాపు 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోడ్ కు గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్స్ జోడించి దుబాయ్ లోనే ఈసీన్ చిత్రీకరించినట్లుగా ఒక అభిప్రాయం కలగచేయాలని 'సాహో' దర్శక నిర్మాతలు చాల పట్టుదలగా పని చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా ఈ సీన్ చిత్రీకరణ కోసం ప్రభాస్ తో పాటు బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ డేట్లు 'సాహో' నిర్మాతల వద్ద ఉన్నా రకరకాల కారణాలతో ఈసినిమా షూటింగ్ అతి నెమ్మదిగా జరగడం నిర్మాతలను టెన్షన్ పెడుతున్నట్లు టాక్. 2019 సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదల చేయాలి అని ప్రయత్నిస్తున్న ఈమూవీ షూటింగ్ కనీసం ఇప్పటి వరకు 25 శాతం కూడ పూర్తికాని నేపధ్యంలో ఈ ఏడాది చివరకు అయినా 'సాహో' తన షూటింగ్ ను పూర్తి చేసుకోగలుగుతుందా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి..
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







