వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖలకు 'కళారత్న' పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- February 26, 2018
అమరావతి: ఈ ఏడాది 'విళంబి' నామ సంవత్సరం సందర్భంగా ఉగాది రోజున వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖలకు కళారత్న (హంస) పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి విజయ్‌భాస్కర్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రముఖులు మార్చి 7వ తేదీ లోపు బయోడేటాతో కూడిన దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. గతంలో పద్మ అవార్డులు, సంగీత నాటక, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు పొందిన వారిని ఈ అవార్డులకు పరిశీలించే విషయమై ఎంపిక సంఘం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బయోడేటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, జి.వి.ఆర్. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల బిల్డింగ్, దుర్గాపురం, విజయవాడ అడ్ర్‌సకు పంపించాలని చెప్పారు. లేకుంటే [email protected] మెయిల్‌కు పంపించవచ్చునని అన్నారు. అభ్యర్థుల తరుఫున ఇతరులు కూడా ప్రతిపాదనలు పంపించవచ్చునన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







