దూసుకొస్తున్న చరణ్ విమానాలు..
- May 05, 2015
' ట్రూ జెట్ ' పేరుతో టాలీవుడ్ నటుడు రామ్చరణ్ తేజ బ్రాండ్ అంబాసిడర్గా టర్బో మేఘ విమాన సేవలు ప్రారంభంకానున్నాయి. ఈ సేవలు జూన్ నెల నుండి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నామని , జూన్ నెలాఖరులోగా తొలి విమానం ఎగురుతుందని టర్బో మేఘ ఎయిర్వేస్ ఫౌండర్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. డీజీసీఏ అనుమతులు కూడా తుది దశలో ఉన్నాయన్నారు. ఒక్క తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా అటు ఉత్తరాదీన అహ్మదాబాద్ , పుణే , గోవాలలో కూడా ఈ సర్వీసులను ప్రారంభించనున్నట్లు ఉమేష్ తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా రీజనల్ షెడ్యూల్ ఎయిర్లైన్స్ సర్వీసులను కూడా టర్బో మేఘ ఎయిర్వేస్ ఇప్పుడు ప్రారంభించనుంది. ముఖ్యంగా దేశంలో పెద్ద పెద్ద నగరాలతో పాటు చిన్న పట్టణాలలో కూడా విమాన సర్వీసులకు డిమాండ్ అధికంగా ఉందని , దీన్ని దృష్టిలో పెట్టుకొని ద్వితీయశ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ఉమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమాన ఇంధనంపై పన్నులను తగ్గించిందని , తెలంగాణ ప్రభుత్వం కూడా పన్నులను తగ్గించాలని కోరుతున్నామని ఉమేశ్ అన్నారు .
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







