వచ్చే మూడేళ్లలో ఎటువంటి ఫీజుల భారాన్ని మోపం అని ప్రకటించిన యూఏఈ ప్రధాన మంత్రి
- March 01, 2018
అబుదాబి: రానున్న మూడేళ్లలో యూఏఈ ఫెడరల్ ఫీజుల్లో ఎలాంటి పెరుగుదల ఉండబోదని యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ కింగ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం భరోసా ఇచ్చారు. విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్థికాభివృద్ధి, సామాజిక స్థిరత్వం, పారిశ్రామిక, వాణిజ్య రంగాలను అభివృద్ధి చేయాలని, ఆ చర్యలతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆరోగ్యం, రవాణా, భవిష్యత్తు ఉపకరణాలు, నీరు, వాతావరణం, అంతరిక్ష సాంకేతికాభివృద్ధి వంటి రంగాల అభివృద్ధికి తొలుత ప్రాధాన్యత ఇస్తామని, కేబినెట్ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించానని షేక్ మొహమ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి







