చికిత్స కేంద్రంలో అగ్ని ప్రమాదం
- March 02, 2018
బకు: అజెర్ బాయ్‌జాన్ దేశ రాజధాని నగరం బకులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బకు పట్టణంలోని ఔషధ చికిత్స కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాదస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పశ్చిమాసియా, తూర్పు యూరప్ దేశాల సరిహద్దు వెంబడి అజెర్బాయ్జాన్ దేశం ఉంటుంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి







