దొంగతనం: మాల్ సెక్యూరిటీ గార్డ్‌కి 3 నెలల జైలు
- March 02, 2018
దుబాయ్:మాల్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తోన్న 25 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తికి దొంగతనం కేసులో మూడు నెలల జైలు శిక్ష విధింపబడింది. జైలు శిక్ష అనంతరం నిందితుడ్ని దేశం నుంచి డిపోర్ట్ చేస్తారు. మాల్‌లోని బ్యాగేజ్ డిపాజిట్ సెక్షన్ నుంచి ఓమహిళకు చెందిన బ్యాగులో ఉన్న 15,000 దిర్హామ్‌లు, 1,800 దిర్హామ్‌లు, మరో బ్యాగులోంచి 1,800 దిర్హామ్‌లను నిందితుడు దొంగిలించాడు. జనవరిలో ఈ దొంగతనాల గురించి ఫిర్యాదు రాగా, నిందితుడ్ని అరెస్టు చేసి బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. షాపింగ్ సెంటర్‌కి వచ్చేవారి బ్యాగుల నుంచి నగదును దొంగిలించిన మాట వాస్తవమేనని నిందితుడు ఒప్పుకున్నట్లుగా విచారణాధికారి ప్రాసిక్యూటర్‌కి వివరించారు. నిందితుడికి సంబందించిన స్థలంలో సోదాలు నిర్వహించిన పోలీసులకు 4,600 డాలర్లు, 310 దిర్హామ్‌ల సొమ్ముల్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







