'మిస్సింగ్' షార్ట్ ఫిలిం
- March 02, 2018రైతు దేశానికి వెన్నుముక. అందరికీ అన్నం పెట్టే అన్నదాత. అలాంటి రైతన్న ప్రకృతి కన్నెర్ర జేసినా, నాయకులు కనికరించకపోయినా, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోయినా ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తాడు. రోజూ ఏదో ఒక మూల రైతు ఆత్మహత్య అన్న వార్తలు కంట తడి పెట్టిస్తాయి. అలాంటి రైతు పాత్రనే ప్రధానాంశంగా తీసుకుని నిజామాబాద్ జిల్లా మోతె గ్రామానికి చెందిన గంగారెడ్డి షార్ట్‌ఫిల్మ్ తీశాడు. లండన్‌లో ఎంబీఏ చేసిన గంగాధర్ అమెజాన్‌లో వచ్చిన ఉద్యోగాన్ని వదులుకుని మరీ కెమెరా పట్టుకున్నాడు.
సొంతంగా రెండు యాడ్ ఫిల్మ్ చేశాడు. అవి లక్షల్లో లైకులని సంపాదించిపెట్టాయి. వాటి స్ఫూర్తితోనే మరో 4 నిమిషాల నిడివిగల 'మిస్సింగ్'ని తీసాడు. ఇందులో అన్నదాత దీన పరిస్థితిని ప్రధానాంశంగా తీసుకున్నాడు. సమాజం, ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని పరిస్థితిలో ఓ మహిళా రైతు తన కొడుకు కోసం వెతుకుతుంటుంది. మా అబ్బాయి కనిపించడంలేదంటూ దారిన పోయే వాళ్లందర్నీ అడుగుతుంటుంది. ఈ చిన్ని చిత్రం ఎన్నో మనసులను ఆలోచింపజేస్తుంది. ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఫేస్‌బుక్‌లో ఇప్పటి వరకూ అరవై లక్షల మందికి పైగా వీక్షించారు. అందుకే న్యూజెర్సీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈ చిత్రం ఎంపికైంది.
తాజా వార్తలు
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి







