హైదరాబాద్ చేరుకున్న కువైట్ ఆమ్నెస్టీ బాధితులు
- March 06, 2018
హైదరాబాద్:కువైట్ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షను ఉపయోగించుకొని, APNRT సమకూర్చిన ఉచిత టికెట్లతో 25 మంది ప్రవాసాంధ్రులు తొలి విడతలో తిరిగి వచ్చారు. ఈరోజు(06-03-18) ఉదయం 1:30 గంటలకు మొదటి విడతగా ప్రవాసులు జజీరా ఎయిర్ వేస్ లో కువైట్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్టు కు వచ్చారు ఆ తర్వాత APNRT ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో వారి వారి స్వగ్రామమునకు వెళ్లారు. మొత్తం ౩౦౦౦ వేలమందికి పైగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోనున్నారు. APNRT MRC డైరెక్టర్ చప్పిడి రాజశేఖర్ , స్మార్ట్ విలేజ్ కోఆర్డినేటర్ ఆర్.దినేష్ మరియు ఇతర బృందం హైదరాబాదు ఎయిర్ పోర్టు లో అంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వీరికి ఘన స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారందరికి వారి సొంత ప్రాంతాలలో 3 నెలల పాటు ఉచిత నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇవ్వనున్నట్లు NRI మంత్రి కొల్లు రవీంద్ర , APNRT అధ్యక్షుడు డా.రవికుమార్ పి.వేమూరు మరియు CEO కె. సాంబశివరావు తెలిపారు.


తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







