భారత జవానులను భందించిన నేపాల్ భద్రతా బలగాలు

- November 29, 2015 , by Maagulf
భారత జవానులను భందించిన నేపాల్ భద్రతా బలగాలు

స్మగ్లర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భారత సైనికులను నేపాల్‌ సరిహద్దు భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. నేపాల్‌ దేశంలోకి అక్రమంగా డీజిల్‌ రవాణా చేస్తున్న స్మగ్లర్లను అనుసరిస్తూ సశస్త్ర సీమ బల్‌(ఎస్‌ఎస్‌బీ)కు చెందిన ఇద్దరు సైనికులు నేపాల్‌లోని జపా అనే గ్రామంలోకి ప్రవేశించారు. అయితే వారి వద్ద ఆయుధాలు లేకపోవడం గమనించిన సైనికులు వారిని పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. నేపాల్‌ భద్రతా సిబ్బంది అదుపులో ఉన్న ఇద్దరు ఎస్‌ఎస్‌బీ సిబ్బందిని తీసుకొచ్చేందుకు వెళ్లిన మరో 10 మంది సైనికులను కూడా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత సైన్యాధికారులు నేపాల్‌ ఆర్మీతో చర్చలు జరుపుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com