నేపాల్‌లో భారత ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసిన కేబుల్ ఒపెరటర్లు
- November 29, 2015
భారత్ నుంచి నేపాల్ సరకు రవాణా ఆగిపోవడంతో ఆ దేశంలో భారత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జాయింట్ మాదేశీ ఫ్రంట్ ఆధ్వర్యంలో నేపాల్‌లోని కేబుల్ ఆపరేటర్లంతా కలిసి భారత ఛానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. నేపాల్‌కు సరకు రవాణాను భారత్ అడ్డుకుందని.. అందుకే ఆ దేశ ఛానళ్ల ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు కేబుల్ ఆపరేటర్లు తెలిపారు.నేపాల్‌కు వెళ్లే నిత్యావసర వస్తువులను తరలించే ట్రక్కులు సరిహద్దు వద్ద నిలిచిపోయాయి. అయితే భద్రతా కారణాల వల్లే సరకు రవాణా నిలిచిపోయిందని భారత్ చెబుతోంది. ఈ విషయంపై నేపాల్‌లో భారత రాయబారి రంజిత్ రే మాట్లాడారు. ఇలాంటి ఆందోళనలు దేశంలో భారత్‌పై వ్యతిరేకతను ప్రోత్సహించేలా ఉన్నాయని.. ఇవి రెండు దేశాలకు హానికరమన్నారు. సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







