నేపాల్‌లో భారత ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసిన కేబుల్ ఒపెరటర్లు

- November 29, 2015 , by Maagulf
నేపాల్‌లో భారత ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసిన కేబుల్ ఒపెరటర్లు

భారత్‌ నుంచి నేపాల్‌ సరకు రవాణా ఆగిపోవడంతో ఆ దేశంలో భారత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జాయింట్‌ మాదేశీ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో నేపాల్‌లోని కేబుల్‌ ఆపరేటర్లంతా కలిసి భారత ఛానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. నేపాల్‌కు సరకు రవాణాను భారత్‌ అడ్డుకుందని.. అందుకే ఆ దేశ ఛానళ్ల ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు కేబుల్‌ ఆపరేటర్లు తెలిపారు.నేపాల్‌కు వెళ్లే నిత్యావసర వస్తువులను తరలించే ట్రక్కులు సరిహద్దు వద్ద నిలిచిపోయాయి. అయితే భద్రతా కారణాల వల్లే సరకు రవాణా నిలిచిపోయిందని భారత్‌ చెబుతోంది. ఈ విషయంపై నేపాల్‌లో భారత రాయబారి రంజిత్‌ రే మాట్లాడారు. ఇలాంటి ఆందోళనలు దేశంలో భారత్‌పై వ్యతిరేకతను ప్రోత్సహించేలా ఉన్నాయని.. ఇవి రెండు దేశాలకు హానికరమన్నారు. సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com