హైదరాబాద్ యశోద ఆసుపత్రి లో రోగికి గుండె మార్పిడి శస్త్రచికిత్స
- November 29, 2015
శనివారం నగరంలోని యశోద ఆసుపత్రిలో జరిగిన మరో గుండె మార్పిడి శస్త్రచికిత్సతో ఇప్పటివరకు గుండెమార్పిడి శస్త్రచికిత్స 13కు చేరింది. ఇటీవల కాలంలో క్లిష్టమైన గుండె, కాలెయం, కిడ్నీ తదితర అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు హైదరాబాద్ నగరం నిలయమైంది. కేరళ రాష్ట్రం, తిరుచ్చి పట్టణం నుంచి నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి 30నిమిషాల 5సెకెన్లలో గుండెను తరలించారు. శనివారం ఉదయం కేరళా, తిరుచ్చిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడు తీవ్రంగా గాయపడి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అయితే బాధితుడు బ్రెయిడ్ డెడ్‌కు గురైనట్లు ఆసుపత్రి వర్గాలు జీవన్‌దాన్ అధికారిని అనురాధకు సమాచారం అందించారు. వెంటనే ఆమె యశోద ఆసుపత్రి గుండె మార్పిడి శస్త్రచికత్స నిపుణులు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేకు సమాచారాన్ని ఇచ్చారు. దీంతో యశోద వైద్యబృందం ప్రత్యేక విమానంలో కేరళకు చేరుకుని గుండెను సేకరించారు. 3.30గంటలకు వైద్యులు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 4 గంటల 5 సెకన్లకు నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గుండెను వీలైనంత తొందరగా సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి అంబులెన్సులో చేర్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంతో మూడు నిమిషాల్లో బేగంపేట విమానాశ్రయం నుంచి మూడు నిమిషాల్లో సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి గుండెను తరలించారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నల్లకుంట ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌రాజు(56) మూడు నెలల క్రితం యశోద ఆసుపత్రిలో చేరాడు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యు లు గుండె మార్పిడి తప్పదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బాధితుడు తన పేరును జీవన్‌దాన్‌లో నమోదు చేసుకున్నాడు. ఈ మేరకు శనివారం జీవన్‌దాన్ సహకారంతో యశోద వైద్యులు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో తీసుకువచ్చిన గుండెను శ్రీనివాస్‌కు అమర్చారు. రోగి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు ఒకటి రెండు రోజుల్లో తెలియజేస్తామని వైద్యులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







