నీట మునిగిన కారులోని ఇద్దరినీ రక్షించడానికి వచ్చి...రెస్క్యూ టీం సభ్యుడు గల్లంతు

- March 09, 2018 , by Maagulf
నీట మునిగిన కారులోని ఇద్దరినీ రక్షించడానికి వచ్చి...రెస్క్యూ టీం సభ్యుడు గల్లంతు

కువైట్ :నీటిలో మునిగిపోయిన ఇరువురిని రక్షించడానికి వచ్చిన ఒక రెస్క్యూ టీం సభ్యుడు గల్లంతు అయ్యాడు.స్థానిక సుబియ్య లో సముద్రపు నీరు ప్రవహించే ఒక కాలువ అంచు వెంబడి ఇరువురు వ్యక్తులు  కారుని నడుపుతుండగా అకస్మాత్తుగా బురదలోనికి కారు జారిపోవడంతో ఇద్దరు పౌరులు ఉప్పునీళ్లలో మునిగిపోయారు.ఈ సమాచారం అందుకొన్న విపత్తు నివారణ జట్టు సభ్యులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. నీట మునిగిన ఇద్దరు కోసం ఆ బృందం అన్వేషిస్తుండగా, కువైట్ దేశస్తుడు కానీ ఒక విపత్తు నివారణ జట్టులోని సభ్యుడు కనిపించలేదు. అయితే తొలుత కారుతో సహా నీట మునిగిన ఇరువురు పౌరులు ఈత కొడ్తూ సురక్షితంగా ఒడ్డుకి చేరుకొన్నారు  కానీ విపత్తు నివారణ జట్టు సభ్యులు తమ సహోద్యోగి ఆచూకీ  కనుగొనలేకపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com