మూడోసారి మకావ్ ఓపెన్ కైవసం చేసుకున్న సింధు
- November 29, 2015
తెలుగు తేజం, హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిమి పీవి. సింధు మరోసారి అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించింది. వరుసగా మూడోసారి మకావ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్లో విజయం సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆదివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన మినత్సు మితానిపై విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచింది. 66 నిమిషాలు పాటు సాగిన మ్యాచ్‌లో తాను గెలిచిన రెండు సెట్లలో పూర్తి ఆధిపత్యం చూపించిన సింధు 21- 9, 21- 23, 21- 14 తేడాతో మితానిని ఓడించింది. మొదటి సెట్ సునాయాసంగా గెలుచుకున్న సింధుకు రెండో సెట్లో మితానిని గట్టి పోటీ ఇచ్చింది. ఆ వెంటనే మూడో గేమ్ ప్రారంభం నుంచి ధాటిగా ఆడి 21- 14తేడాతో గెల్చుకుని వరుసగా మూడో సారి మకావ్ ఓపెన్ విజేతగా నిలిచింది. మకావ్ ఓపెన్ 2013, 2014లలో విజేతగా నిలిచిన సింధు వరుసగా 2015 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. గత ఏడాది ఇదే మకావు ఓపెన్‌లో చివరిసారి అంతర్జాతీయ టైటిల్ సాధించిన సింధుకు ఆ తర్వాత టోర్నీల్లో నిరాశ ఎదురైంది. గత నెలలో డెన్మార్క్ ఓపెన్‌లో సింధు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ రన్నరప్‌గా నిలిచింది.
తాజా వార్తలు
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!









