భారతీయులకు తక్కువ ధరకే వీసాలివ్వాలి..యూకే మేధోవర్గం సూచనలు
- March 10, 2018
లండన్: గత రెండేళ్లుగా బ్రిటన్‌కు భారత పర్యాటకుల తాకిడి తగ్గిపోయింది. మరోవైపు బ్రిటన్‌తో పోలిస్తే పక్కనే ఉన్న ఫ్రాన్స్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఇలా జరగకుండా భారతీయ పర్యాటకులను ఆకట్టుకోవాలంటే వారి వీసా ధరలను తగ్గించాలని సూచిస్తోంది యూకేలోని మేధోవర్గం. ఈ మేరకు రాయల్ కామన్వెల్త్ సొసైటీ(ఆర్సీఎస్) దీనిపై అధ్యయనం చేసి ఈ విధంగా సూచనలు చేసింది.
ఆర్సీఎస్ విడుదల చేసిన 'బ్రిటన్ అండ్ ఇండియా: బిల్డింగ్ ఏ న్యూ వీసా పార్ట్నర్షిప్' నివేదిక ప్రకారం.. 2016లో భారత్ నుంచి 6లక్షల మంది భారత పర్యాటకులు ఫ్రాన్స్‌కు వెళ్లారు. యూకేతో పోలిస్తే ఈ సంఖ్య 1,85,000 ఎక్కువ. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2016లో యూకేలో భారత పర్యాటకుల సంఖ్య 1.73శాతం తగ్గగా.. ఫ్రాన్స్‌లో మాత్రం 5.3శాతం పెరిగింది. అయితే వీసా ధరను తగ్గిస్తే భారత పర్యాటకులను ఆకట్టుకోవచ్చు అని నివేదిక పేర్కొంది. ఇందుకోసం సరికొత్త యూకే-ఇండియా వీసా ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం.. ప్రస్తుతమున్న రెండేళ్ల వీసా ధరను 388 పౌండ్ల (సుమారుగా రూ.35 వేలు) నుంచి 89 పౌండ్లకు (సుమారుగా రూ.8 వేలు) తగ్గించాలని నివేదిక సూచించింది. ఇలా చేయడం వల్ల వాణిజ్యపరంగా, పర్యాటక పరంగా దేశం మరింత అభివృద్ధి చెందుతుందని, అంతేగాక ఇరుదేశాల మధ్య వ్యాపార బంధాలు బలోపేతమవుతాయని మేధోవర్గం అభిప్రాయపడుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







