ప్రవాసియ ఇంజనీర్లు కువైట్ ఇంజనీర్స్ సొసైటీ నుంచి ఎటువంటి అభ్యంతరం లేదనే సర్టిఫికేట్ పొందాలి
- March 12, 2018
కువైట్ : కువైట్ ఇంజనీర్స్ సొసైటీ (కె.ఇ.ఎస్) నుండి ఎటువంటి అభ్యంతరం లేదనే సర్టిఫికేట్ ను ప్రవాసియ ఇంజనీర్ల నుంచి పొందకపోతే వారి నివాస అనుమతిని (రెసిడెన్సీ లేదా ఇహమామా పర్మిట్లను) ఎట్టి పరిస్థితిలోనూ పునరుద్ధరించకూడదని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పి ఏ ఎమ్) అన్ని కార్మిక విభాగానికి ఒక సూచన జారీ చేసింది .ఈ నిర్దేశించిన విధానం ప్రకారం, ప్రవాసియ ఇంజనీర్ కువైట్ ఇంజనీర్స్ సొసైటీ నుంచి ఎన్ఓసి తన విద్యావిషయక.. విద్యార్హత కు సంబంధించింది. ముందుగా, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ మరియు కువైట్ ఇంజనీర్స్ సొసైటీ ఇంజనీరింగ్ డిగ్రీ యొక్క ధృవీకరణ కోసం ఒక ఎలక్ట్రానిక్ విధానంను అభివృద్ధి చేసింది. ప్రస్తుత విధానం ప్రకారం, ప్రభుత్వ రంగ ఉపాధి కోసం, ఇంజనీరింగ్ డిగ్రీ ఒక ఎన్ బి ఏ గుర్తింపు పొందిన సంస్థ నుండి పొందినదై ఉండాలి. కువైట్ ఇంజనీరింగ్ సొసైటీ వార్షిక ప్రాతిపదికన భారతదేశంతో సహా ఎన్ బి ఏ గుర్తింపు పొందిన సంస్థల జాబితాను నవీకరిస్తుంది. ఈ కొత్త నిర్ణయంతో ఇంజనీరింగ్ డిగ్రీలు గుర్తింపు పొందిన సంస్థల నుండి పొందని , ప్రవాసియ ఇంజనీర్లపై ఎంతో ప్రభావితం చూపుతుంది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







