లోఫర్ డిసెంబర్-18న విడుదల

- November 30, 2015 , by Maagulf
లోఫర్ డిసెంబర్-18న విడుదల

వరుణ్ తేజ్ హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లోఫర్. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. డిసెంబర్-18న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన నిర్మాత సి.కళ్యాణ్.. ఇప్పుడు ఆడియో రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ ఆడియో డిసెంబర్-7న విడుదల కాబోతోంది. శిల్పకళావేదికలో జరగనున్న ఈ ఆడియోకు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో పూరి దర్శకత్వంలో ఏక్ నిరంజన్, బుజ్జిగాడు చిత్రాల్లో ప్రభాస్ నటించాడు. పూరీతో ఉన్న ఆ అనుబంధం కొద్దీ ఇప్పుడీ మూవీ ఆడియో రిలీజ్‌కు ప్రభాస్ అతిథిగా రాబోతున్నాడట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com