కార్ రెంటల్ ఆఫీసులకు భారీ జరీమానా
- March 15, 2018
జెడ్డా: కింగ్‌డమ్‌లోని 650 కార్ రెంటల్ ఆఫీసులకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అల్టిమేటం జారీ చేసింది. సౌదీజేషన్లో భాగంగా, వలసదారులకు ఉద్యోగాల్ని కల్పించరాదనీ, నిబంధనల్ని ఉల్లంఘిస్తే ఒక్కో వలసకార్మికుడికి 20,000 సౌదీ రియాల్స్ చొప్పున కార్ రెంటల్ ఆఫీసులు జరీమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కార్ రెంటల్ ఆఫీసుల్లో సౌదీజేషన్ మార్చి 18 నుంచి అమల్లోకి రానుంది. అకౌంట్స్, సూపర్విజన్, సేల్స్, డెలివరీ మరియు రిటర్న్ విభాగాల్లో ఉద్యోగాల్ని వెంటనే జాతీయం చేయాలని స్పష్టం చేసింది మినిస్ట్రీ. ఎప్పటికప్పుడు తనిఖీలు ఉంటాయనీ, ఎవరు ఉల్లంఘనలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు మినిస్ట్రీ అధికారులు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







