అమెరికా లో కుప్పకూలిన ఓవర్ బ్రిడ్జి
- March 15, 2018
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. అందరూ చూస్తుండగానే ఫుట్ ఓవర్ బ్రిడ్జి కుప్పకూలింది.. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అమెరికాలోని మియామిలో చోటుచేసుకుంది. భారత్ కాలమానం ప్రకారం ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. బ్రిడ్జి కింద వాహనాలు చిక్కుకోవడంతో మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. కాగా ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సిటీ ఆఫ్ స్వీట్వాటర్ను అనుసంధానించి విద్యార్థులు దాటేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. కేవలం నెలల వ్యవధిలోనే ప్రారంభించిన ఈ బ్రిడ్జి, ఒక్కసారిగా కూలడంతో సదరు ఇంజినీర్లు , కాంట్రాక్టర్ పై వేటుపడే అవకాశముందని అక్కడి ప్రభుత్వ వర్గాలు దృవీకరిస్తున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సహాయకచర్యలను దగ్గరుండి చూసుకోవాలని హెల్త్ అండ్ రెస్క్యూ హెడ్ టామ్ ప్రైస్ ను ఆదేశించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







