ప్రముఖ బాంగ్రా పాప్ గాయకుడు దలేర్ మెహందీకు జైలు శిక్ష
- March 16, 2018ప్రముఖ బాంగ్రా పాప్ గాయకుడు దలేర్ మెహందీని మనుషుల అక్రమ రవాణా కేసులో పాటియాలా కోర్టు దోషిగా తేల్చింది. తన మ్యూజికల్ ట్రూప్ విదేశాల్లో చేసే కార్యక్రమాల్లో భాగంగా అక్కడి వెళ్లే వారితో పాటు.. కొంత మందిని అక్రమంగా విదేశాలకు తీసుకెళ్లినట్టుగా 2003లో దలేర్ మెహందీ, అతని సోదరుడు షంషేర్ సింగ్‌లపై కేసు నమోదైంది. యూఎస్, యూకే, కెనడా లతో పాటు మరికొన్ని దేశాలకు దలేర్ మనుషులను తీసుకెళ్లినట్టుగా ఆరోపణలు వచ్చాయి.
దలేర్‌కు వ్యతిరేకంగా 31 కేసులు నమోదు కావటంతో గతంలో పాటియాలా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్ పై విడుదలైన దలేర్ ఇన్నేళ్లుగా విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా పాటియాలా కోర్ట్ దలేర్ మెహందీని దోషిగా తేల్చింది. ప్రస్తుతం దలేర్‌తో పాటు ఆయన సోదరుడు షంషేర్ సింగ్ పాటియాలా కోర్ట్ కస్టడీలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్