మస్కట్ నుంచి ఉమ్రా కోసం సలామ్‌ఎయిర్ కొత్త విమానం
- March 16, 2018
మస్కట్: ఒమన్ తొలి లోకాస్ట్ క్యారియర్ సలామ్ ఎయిర్, మస్కట్ నుంచి టైఫ్‌కి తొలిసారిగా డైరెక్ట్ ఫ్లయిట్స్‌ని నడుపుతున్నట్లు ప్రకటించింది. మే 15 నుంచి ప్రారంభమయ్యే ఈ విమాన సర్వీసులు పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఉమ్రా ప్రార్థనల కోసం వెళ్ళేవారికి ఉపయోగపడనున్నాయి. రిటర్న్ టిక్కెట్స్‌తో కలిపి 99 ఒమన్ రియాల్స్‌లోనే విమానాల్ని నడిపేలా సలామ్ ఎయిర్ ఈ విమాన సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తోంది. సలామ్ ఎయిర్ సిఇఓ కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ, హోలీ మాస్క్ ప్రార్థనల కోసం ఈ సర్వీసుల్ని ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన టెర్మినల్ నుంచి విమానాలు బయల్దేరతాయని ఆయన వివరించారు. టైఫ్‌కి వెళ్ళి, అక్కడి నుంచి తిరిగొచ్చే సర్వీసులకు సంబంధించి టైమింగ్స్‌ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు. సలామ్ ఎయిర్‌కి, సౌదీ అరేబియా కింగ్‌డమ్ కీలకమైన మార్కెట్‌గా సలామ్ ఎయిర్‌కి మారింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం
- ఏపీలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై కేంద్రం శుభవార్త
- IPL మెగా ఆక్షన్: 2025లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ల పూర్తి జాబితా..
- వరల్డ్ కప్ విజేతలకు విశాఖలో స్వాగతం..
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!







