రెండు కొత్త రూట్స్‌ని ప్రారంభించనున్న మవసలాట్
- March 16, 2018
మస్కట్: నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ (మవసలాట్), వచ్చే మంగళవారం నుంచి రెండు కొత్త రూట్స్‌ని ప్రారంభించనుంది. మాబెలా - న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రువి - న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మధ్య ఈ సర్వీసుల్ని నడుపుతారు. విమాన ప్రయాణీకులకు వీలుగా ఈ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు మవలసాట్ పేర్కొంది. ప్రతి 30 నిమిషాలకీ బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా మవసలాట్ బస్సుల్ని కొనుగోలు చేసింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ఎప్పటికప్పుడు సరికొత్త రూట్లు, సరికొత్త బస్సుల్ని ప్రవేశపెడుతున్నట్లు మవసలాట్ పేర్కొంది. మవసలాట్, ఒమన్ ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సంయుక్తంగా ఓ అగ్రిమెంట్‌ని ట్యాక్సీ సర్వీసుల కోసం కుదుర్చుకున్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







