ఇల్లీగల్‌ డ్రగ్స్‌: 118 వెబ్‌సైట్స్‌ని బ్లాక్‌ చేసిన దుబాయ్‌ పోలీస్‌

- March 16, 2018 , by Maagulf
ఇల్లీగల్‌ డ్రగ్స్‌: 118 వెబ్‌సైట్స్‌ని బ్లాక్‌ చేసిన దుబాయ్‌ పోలీస్‌

దుబాయ్‌ పోలీస్‌ - యాంటీ నార్కోటిక్‌ డిపార్ట్‌మెంట్‌ 118 వెబ్‌సైట్స్‌ని బ్లాక్‌ చేసింది. అక్రమంగా డ్రగ్స్‌ని ప్రమోట్‌ చేస్తున్నందుకుగాను ఈ చర్యలు తీసుకున్నారు. డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ కల్నల్‌ ఈద్‌ మొహమ్మద్‌ తని హరెబ్‌ మాట్లాడుతూ, గత రెండేళ్ళలో 100 వెబ్‌సైట్స్‌ని ఎలక్ట్రానిక్‌ పెట్రోల్స్‌ బ్లాక్‌ చేశాయనీ, 18 వెబ్‌సైట్లు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా బ్లాక్‌ చేసినట్లు తెలిపారు. గత ఏడాదిలో డ్రగ్‌ డీలర్ల అరెస్టులు డబుల్‌ అయ్యాయని ఆయన వివరించారు. దుబాయ్‌ పోలీస్‌ అనుసరిస్తోన్న అత్యాధునిక టెక్నాలజీ కారణంగానే ఈ అక్రమ డ్రగ్స్‌ వ్యాపారాన్ని అదుపు చేయగలుగుతున్నట్లు చెప్పారాయన. మూడు స్మార్ట్‌ ప్రోడక్ట్స్‌ని ఉపయోగించి డ్రగ్స్‌ అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేస్తున్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com