రస్ అల్ ఖైమాలో రోడ్డు ప్రమాదం 34 ఏళ్ళ ఎమిరేటీ మృతి
- March 16, 2018
రస్ అల్ ఖైమా:34 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి రస్ అల్ ఖైమాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అల్ రామ్స్ ప్రాంతంలో 19 ఏళ్ళ వ్యక్తి నడుపుతున్న కారు దూసుకెళ్ళడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అల్ రామ్స్ పోలీస్ స్టేషన్ చీఫ్ - కల్నల్ ఇబ్రహీమ్ మొహమ్మద్ మట్టర్ చెప్పారు. ప్రమాదం గురించి సమాచారం అందగానే ట్రాఫిక్ పెట్రోల్, అంబులెన్స్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్‌ని సంఘటనా స్థలానికి పంపించామని చెప్పారాయన. బాధితుడ్ని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశామనీ, దురదృష్టవశాత్తూ అతని ప్రాణాలు కాపాడలేకపోయామని వివరించారు కల్నల్ ఇబ్రహీమ్. మృతదేహాన్ని మార్గ్యుకి తరలించారు. వాహనదారులు రాత్రి వేళల్లో తమ వాహనాలు నడిపేటప్పుడు మరింత అప్రమత్తంగా వుండాలనీ ఈ సందర్భంగా కల్నల్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..