'నీది నాది ఒకే కథ' ట్రైలర్ టాక్..!
- March 16, 2018
'విజయానికి ఐదు మెట్లు.. విజయానికి ఆరు మెట్లు.. నీ చేతుల్లోనే విజయం.. ఆత్మ విశ్వాసంలో మజాకా.. యా!!' అంటూ పుస్తకాలను చూసి తెగ సంబర పడిపోతున్నారు శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'నీది నాది ఒకే కథ'. సత్నా టిటస్(బిచ్చగాడు ఫేం)కథానాయిక. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ ఎంత చదివినా గుర్తుంచుకోని సగటు విద్యార్థిగా సాగర్ అనే పాత్రలో శ్రీవిష్ణు కనిపించనున్నారు. 'ఒక రకంగా చెప్పాంటే మీలా అవ్వాలని ధార్మికగారు' అని హీరోయిన్ను శ్రీవిష్ణు అడుగుతుంటే .. 'చూడు సాగర్.. నేనేదో గ్రేట్ కాదు కానీ, నీలాంటి వేస్ట్ ఫెలోస్ను మార్చడంలో నాకో తృప్తి ఉంటుంది' అంటూ హీరోయిన్ చెప్పడం నవ్వులు పూయిస్తోంది.
'నవ్వు రావడం, కోపం రావడం, బాధ కలగడం ఇవన్నీ బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ కదా' అంటూ శ్రీవిష్ణు ప్రశ్నించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఒత్తిడిని తట్టుకుని సాగర్ చదువులో రాణించాడా? తన తండ్రికి నచ్చేలా మారాలన్న తన లక్ష్యాన్ని చేరుకున్నాడా? అన్నదే 'నీది నాది ఒకే కథ'. ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆరాన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







