దుబాయ్‌లో ఎక్కువ రెస్టారెంట్స్ ఎవరివంటే!
- March 17, 2018
దుబాయ్:దుబాయ్‌లో 6,802 రెస్టారెంట్లు మరియు కేఫ్‌లు సుమారు 3 మిలియన్ల రెసిడెంట్స్‌కి అలాగే మిలియన్ల సంఖ్యలో వచ్చే విజిటర్స్కీ సేవలందిస్తున్నాయి. ప్రతి ఈటరీ ప్రతిరోజూ 441 మంది రెసిడెంట్స్‌కి సేవలందించడంతోపాటుగా ఏడాదిలో మిలియన్ల సంఖ్యలో వచ్చే టూరిస్టులకీ మంచి ఆహారాన్ని అందిస్తోంది. దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇండియన్స్, పాకిస్తానీస్ మరియు ఈజిప్టియన్స్కి చెందిన రెస్టారెంట్లు ఎమిరేట్‌లో అధికంగా వున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటిష్, లెబనీస్, కువైటీస్, జోర్డానియన్స్, అమెరికన్స్, సౌదీస్, సిరియన్స్ వున్నారు. మూడింట ఒక వంతు అంటే 2,265 రెస్టారెంట్లు న్యూ దుబాయ్, బుర్జ్ ఖలఫా, అల్ కరామా ప్రాంతాల్లోనే ఎక్కువగా వున్నాయి. న్యూ దుబాయ్ లో 646 రెస్టారెంట్లు, కేఫ్‌లు వున్నాయి. బుర్జ్ ఖలీఫాలో 433 వున్నాయి. యూఏఈ రెసిడెంట్స్ సరాసరి 50 నుంచి 150 దిర్హామ్‌ల వరకు ఔటింగ్‌లో లంచ్ లేదా డిన్నర్ కోసం ఖర్చు చేస్తున్నారు విరివిగా.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







