బ్రెజిల్లో ఎల్లో ఫీవర్తో 300మంది మృతి
- March 17, 2018
గత జులై నుండి ఇప్పటివరకు ఎల్లో ఫీవర్తో 300 మంది మరణించారని బ్రెజిల్ ధృవీకరించింది. మొత్తంగా ఈ ఇన్ఫెక్షన్లకు సంబంధించి 920 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రెట్టింపు అయిందని పేర్కొంది. ఎల్లో ఫీవర్ వ్యాధి తీవ్రంగా విస్తరిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు అత్యవసర పరిస్థితి విధించలేదు. అంతకుముందు ఎమర్జన్సీ విధించారు. జనాభా ఎక్కువున్న ప్రాంతాల్లో వైరస్ బాగా ప్రబలంగా వుండడంతో ఇన్ఫెక్షన్లు పెరిగాయని, అందుకే ఎమర్జన్సీ విధించాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దేశంలోని శావోపాలో, రియో డీ జెనీరో, మినాస్ గెరాస్ వంటి జనాభా ఎక్కువున్న రాష్ట్రాల్లోనే ఈ మరణాలు సంభవించాయి. కాగా, ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లోని కోటీ 78లక్షల మందికి ఈ వ్యాధి రాకుండా టీకాలు వేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







