గల్ఫ్ కార్మికుల సంక్షేమంకై తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసిన గల్ఫ్ ప్రవాసీయులు

- March 18, 2018 , by Maagulf
గల్ఫ్ కార్మికుల సంక్షేమంకై తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసిన గల్ఫ్ ప్రవాసీయులు

తెలంగాణ ప్రభుత్వ సచివాలయంలో "ప్రవాస హక్కులు మరియు సంక్షేమ వేదిక" ఆధ్వర్యంలో దుబాయ్ నుండి వెళ్లిన ప్రతినిధి బృందం తెలంగాణ ఆర్ధిక శాఖ మాత్యులు శ్రీ ఈటెల రాజేందర్ ని కలుసుకొని  గల్ఫ్ కార్మికులు మరియు బాధితుల తరపున 2018-2019 బడ్జెట్లో ఎన్ ఆర్ ఐ  సెల్ కు వంద కోట్లు కేటాయించడముపై కృతజ్ఞతలు మరియు హర్షం వ్యక్తం చేస్తూనే దానికి సంభందించిన విధి విధానాలను మరియు గల్ఫ్ సంక్షేమానికి ఆవిధంగా వినియోగిస్తారో తెలియజేయవలసిందిగా కోరడం జరిగింది. దీనికి స్పందించిన మంత్రివర్యులు ప్రభుత్వం తరపున దీనికి సంబంధించిన విధి విధానాల ప్రకటనను త్వరలోనే విడుదల చేస్తుందని తెలియజేసారు, మరియు తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులు మరియు సంక్షేమం పట్ల సానుకూలంగా ఉందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అద్యక్షులు ఏమూల రమేష్ గారు, సురునిదా అరుణ్ కుమార్, అజయ్ తెడ్డు, దండిగూడెం క్రాంతి కుమార్, నందికంటి చరణ్, మరియు తెలంగాణ ధూమ్ ధామ్ కళాకారులు శ్రీ మారంపల్లి రవీందర్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com