కుర్దు ప్రాంతాలపై టర్కీ సైన్యం దాడులు
- March 18, 2018
ఆఫ్రిన్ : సిరియాలోని కుర్దు ప్రాబల్య ప్రాంతాలపై టర్కీ సైన్యం దాడుల్ని తీవ్రతరం చేసింది. ఆఫ్రిన్ నగరంలో టర్కీ సేనలు పాగా వేశాయి. టర్కీ సైన్యం అండదండలతో సిరియాలో పోరాటం సాగిస్తున్న ప్రయివేటు సేనలు ఈ నగరంలోని కుర్దులను వెళ్లగొడుతున్నాయి. అనంతరం ప్రముఖ కుర్దు నాయకుడి విగ్రహాన్ని సేనలు నేలకూల్చాయి. తమ దేశ సరిహద్దుల్లో ఉన్న కుర్దిష్ మిలిటెంట్లను అంతమొందించేందుకు గత రెండు నెలలుగా సిరియాలో దాడులు జరుపుతున్నామని టర్కీ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే, ఈ దాడుల్లో ఇప్పటివరకూ 280 సాధారణ పౌరులు మరణించారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా ఆ ఆరోపణలను టర్కీ ఖండించింది. దీనికంటే ముందు, 'ఫ్రీ సిరియా ఆర్మీ' సేనలు ఆఫ్రిన్ నగరాన్ని ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నాయని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. సేనల దెబ్బకు ఉగ్రవాదులు ఒట్టి చేతులతో పారిపోతున్నారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







