31న గన్నవరం వద్ద అశోక్ లేలాండ్ పార్క్ శంకుస్థాపన
- March 26, 2018
విజయవాడ దగ్గరలోని మల్లవల్లి వద్ద మోడల్ ఇండస్ర్టియల్ పార్క్ లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 1260.06 ఎకరాల సువిశాల భారీ మోడల్ ఇండస్ర్టియల్ పార్క్‌లో 964 ప్లాట్లు ఉండగా, కేటాయింపులకు ముందే హౌస్‌ఫుల్ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే అశోక్ లేల్యాండ్ కంపెనీ దక్షిణ భారత స్థాయిలో వెహికల్ బాడీ బిల్డింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. మరో పక్క ఇదే ఇండస్ర్టియల్ పార్క్ లో, మోహన్ స్పిన్‌టెక్స్ సంస్థకు ఇంటిగ్రేటెడ్ మెగా టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటుకు 81 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.. భారీ పరిశ్రమల కేటగిరిలో ఇవి పోను గోల్డ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు అనేక స్పి న్నింగ్ మిల్లులు, ఫార్మా కంపె నీలు ఆసక్తి చూపి స్తున్నాయి.అయితే ఈ భారీ కంపనీల్లో ముందుగా, ప్రముఖ రవాణా వాహనాల తయారీ సంస్థ అశోక్ లేల్యాండ్ అమరావతిలో తమ యూనిట్ నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధాని పరిధిలో ప్రతిష్టాత్మక పారిశ్రామికవాడగా భావిస్తున్న కృష్ణా జిల్లా మల్లవల్లిలో బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ స్థాపనకు కార్యాచరణ ప్రారంభించింది. ఈనెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి భూమిపూజ చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఏపీఐఐసీ వర్గాలకు సీఎంవో, అశోక్ లేల్యాండ్ నుంచి సమాచారం అందింది. ఇప్పటికే అశోక్ లేల్యాండ్ సంస్థకు ఏపీఐఐసీ 15 ఎకరాలు కేటాయించింది. ఎకరం రూ. 16. 50 లక్షల చొప్పున ధర చెల్లించి 15 రోజుల కిందట భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. కేటాయించిన భూమిలో మౌలిక వసతుల కల్పన, నిర్మాణాలకు వీలుగా భూమి చదును చేయిస్తున్నారు.చెన్నైకి చెందిన సంస్థ ద్వారా మట్టి సామర్థ్య పరీక్షలు చేయిస్తున్నారు. ఇక్కడ నెలకొల్పే యూనిట్లో ఏడాదికి 4,800 చొప్పున బస్సు బాడీ బిల్డింగ్ రూపొందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తర్వాత విడతలో ఛాసిస్లు తయారుచేసే యూనిట్ ను నెలకొల్పవచ్చని సమాచారం. అశోక్ లేలాండ్ సంస్థ ఇక్కడ రూ.135 కోట్ల వ్యయంతో బస్‌బాడీ బిల్డింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా స్థానికంగా 2,295 మందికి ఉపాధిని ఈ సంస్థ కల్పించనుంది..
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







