పీవీ సింధూకు రూ.10 లక్షల నగదు నజరానా
- December 02, 2015
ప్రపంచంలో 12వ ర్యాంక్‌లో ఉన్న సింధూకు 10 లక్షల నగదు నజరానా మకావు టోర్నీ గెలిచిన పీవీ సింధూపై కనక వర్షం కురువనుంది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పీవీ సింధూకు రూ.10 లక్షల నగదు నజరానా ప్రకటించింది. ప్రపంచంలో 12వ ర్యాంక్‌లో ఉన్న సింధూ మకావు ఓపెన్ ఫైనల్లో ఆరవ ర్యాంక్ ప్లేయర్ మిటానిపై 21-9, 21-23, 21-14 స్కోర్‌తో గెలుపొందిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ శ్రేణిలో మరోసారి సింధూ తన ప్రతిభను చాటిందని బ్యాడ్మింటన్ సంఘం పేర్కొంది. టోర్నీకి వెళ్లేముందే సింధూపైన నమ్మకం ఉందని, అనుకున్నట్లుగానే ఆమె టైటిల్‌ను సొంతం చేసుకుందని బాయ్ ప్రెసిడెంట్ అఖిలేష్ దాస్ గుప్తా అన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







