పెళ్లిపై మా ఆలోచన మాత్రం అదే...రణ్వీర్
- March 31, 2018
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ గ్లామర్ బ్యూటీ దీపికా పదుకొణేని వివాహం చేసుకోనున్నాడని గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. శ్రీలంకలో బర్త్‌డే వేడుక జరుపుకున్న దీపికా, ఈ కార్యక్రమానికి రణ్వీర్ ఫ్యామిలీని ఆహ్వానించిందని, బర్త్‌డే వేడుకలో రణవీర్ సింగ్ తల్లిదండ్రులు అంజు భవాని, జగ్జీత్ సింగ్ దీపిక కు ఖరీదైన వజ్రా హారం, సబ్యాసాచి సారీని కూడా గిఫ్టుగా ఇచ్చారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బెంగళూర్‌లో దీపిక తన తల్లి, చెల్లెలితో కలిసి పెళ్ళి షాపింగ్ చేస్తుందట. బట్టలతో పాటు జ్యూయలరీ షాపింగ్‌తో ఈ ముగ్గురు బిజీ బిజీగా ఉన్నారని సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా డిసెంబర్లలో మంచి తేదిని చూసి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేస్తారట ఇరు కుటుంబాల పెద్దలు . ఇలా పలు వార్తలు బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నప్పటికి , దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఇటీవల రణ్వీర్ తమ పెళ్ళికి స్పందించి ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పెళ్ళి విషయం ఎలా బయటకి వచ్చిందో తెలియదు. కాని మా ఆలోచన మాత్రం అదే. పెళ్లిపనులు మొదలు పెట్టాం. అతి త్వరలోనే మా పెళ్ళి జరుగుతుంది. అని అన్నారు. రణ్వీర్ ప్రస్తుతం గల్లీబాయ్, సింబా సినిమాలతో బిజీగా ఉండగా, దీపిక విటమిన్ డీ లోపం కారణంగా చికిత్స తీసుకుంటుంది. త్వరలో నాగ్పాడాకు చెందిన మాఫియా క్వీన్ రహీమా ఖాన్ జీవితమాధారంగా సినిమా చేయనుంది దీపిక.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..