రక్తసిక్తమైన నిశ్చితార్థ వేడుక.. కత్తులతో దాడి చేసి..
- April 01, 2018
హైదరాబాద్ పాతబస్తీలో నిశ్చితార్థం వేడుక రక్తసిక్తమైంది. భోజనంపై మొదలైన గొడవ హత్యకు దారితీసింది. హుస్సేనీఆలం షాగంజ్ తరిఖత్ మంజిల్ ఫంక్షన్ హాల్లో ఈ దారుణం జరిగింది. రౌడీమూకలు రెచ్చిపోవడంతో పెళ్లికొచ్చిన బంధువులంతా షాక్ అయ్యారు. ప్రాణ భయంతో పరుగులుతీశారు.
పాతబస్తీలో షేక్ ఇమాం తన కుమార్తె నిశ్చితార్థం వేడుకల్ని షాగంజ్ తరిఖత్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశాడు. రాత్రి బంధువులంతా హాజరై సందడిగా ఉన్న సమయంలో.. మద్యం మత్తులో ఉన్న అష్వాక్ అనే వ్యక్తి భోజనం సరిగా వడ్డించలేదంటూ కేటరింగ్ వారిని అరిచాడు. అడ్డుకున్న పెళ్లివారితో గొడవకు దిగాడు. బయటకు వెళ్లిన అష్వాక్ కాసేపటికే 20 మందితో ఫంక్షన్ హాల్‌కు తిరిగొచ్చాడు. రక్తపాతం సృష్టించాడు.
అష్వాక్తోపాడూ ఫంక్షన్హాల్లోకి వచ్చిన 20 మంది లోపలున్న కుర్చీలు, టేబుళ్లు విసిరేసి వీరంగం సృష్టించారు. వంటసామాన్లన్నీ చిందరవందర చేశారు. అడ్డుకోడానికి ప్రయత్నించిన మహ్మద్ అన్వర్ అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సోహెల్ అనే మరో వ్యక్తిపై కూడా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్వర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామంటున్నారు. సోహెల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పెళ్లికి వచ్చిన వారంతా ఉస్మానియా ఆస్పత్రికి తరలిరావడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







