కువైట్‌లో బస్సు ప్రమాదం 15 మంది మృతి
- April 02, 2018
కువైట్ సిటీ: రెండు బస్సులు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ (కెఎఫ్‌ఎస్‌డి) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఒకరు కువైటీ పౌరుడు. అల్ అర్తాల్ రోడ్‌లో ఏడవ రింగ్ రోడ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ ఫైటర్స్ వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నప్పటికీ, ప్రమాద తీవ్రత నేపథ్యంలో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరికి అత్యవసర పరిస్థితి నేపథ్యంలో హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించడం జరిగింది. బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్‌లో పనిచేసే కార్మికుల్ని తరలించేందుకు ఈ బస్సుల్ని కాంట్రాక్టింగ్ ఫర్మ్ తరలించిందని కువైట్ ఆయిల్ కంపెనీ (కెఓసి) వెల్లడించింది. మెడికల్ ఎమర్జన్సీ టీమ్స్ సకాలంలో స్పందించాయని కెఓసి పేర్కొంది. మృతుల్లో ఏడుగురు భారతీయులు కాగా, ఐదుగురు ఈజిప్టియన్లు, ముగ్గురు పాకిస్తానీలు వున్నారు. గాయపడ్డవారిలో ఒకరు ఇండియన్ కాగా, మరొకరు కువైటీ.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







