అమృత్‌సర్ చేరుకున్న ఆ మృతదేహాలు

- April 02, 2018 , by Maagulf
అమృత్‌సర్ చేరుకున్న ఆ మృతదేహాలు

అమృత్‌సర్: ఇరాక్‌లోని మోసుల్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతుల్లో హతమైన 39 మంది భారతీయుల మృతదేహాలు ఇవాళ భారత్‌కు చేరుకున్నాయి. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాసేపటి క్రితం మృతదేహాలతో వచ్చిన విమానం ల్యాండైంది. అయితే మోసుల్‌లో మృతిచెందిన వారి బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని కేంద్రం చర్చిస్తోందని మంత్రి వీకే సింగ్ తెలిపారు. ఆ మృతులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లిస్తారన్న అంశాన్ని కూడా తేల్చనున్నట్లు మంత్రి చెప్పారు. ఇరాక్‌లోని మొసుల్‌లో సుమారు 40 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జూన్ 11, 2014లో కిడ్నాప్ చేసింది. అందులో ఒకరు తప్పించుకున్నారు. మిగతా 39 మందిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చంపేసినట్లు ఇటీవల లోక్‌సభలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు ఒకరికి 5 లక్షలు ఇవ్వనున్నట్లు పంజాబా్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. ఒక వ్యక్తికి ఉద్యోగంతో పాటు ఆ ఫ్యామిలీకి 20 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు సిద్ధూ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com