రష్యా ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ల కొనుగోలుకు భారత్ చొరవ
- April 06, 2018
న్యూఢిల్లీ : రష్యాతో రక్షణ ఒప్పందాలపై అమెరికా ఆంక్షలు విధించినా ఆ దేశం నుంచి ఎస్ 400 ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ల కొనుగోలుకు భారత్ చొరవ చూపుతోంది. రూ 30,000 కోట్లతో రష్యా నుంచి క్షిపణి వ్యవస్థను ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా ఆంక్షలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినా రష్యా నుంచి క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలనే నిర్ణయంపై భారత్ ముందుకెళుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.
మరోవైపు అమెరికా ఆంక్షలతో ఒకప్పుడు అగ్రరాజ్యానికి మిత్ర దేశాలైన టర్కీ, ఖతార్, సౌదీఅరేబియాలకు ఎస్-400 మిసైళ్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం నెలకొంది. ఇక భారత్, చైనాలు మాత్రమే ఎస్-400 ఎయిర్ మిసైళ్ల కస్టమర్లుగా రష్యా భావిస్తోంది. 350 కిమీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ మిసైల్స్ పలు శ్రేణుల్లో అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఎస్-400పై రష్యాతో చైనా కూడా ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే మేథో సంపత్తి హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ చైనా రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా వెపన్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసుకుంటుందనే ఆందోళనతో ఈ ఒప్పందంపై రష్యా వెనుకాడుతోంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







